హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని మైలార్ దేవుపల్లిలో ఖాళీ ప్లాటులో అర్ధరాత్రి కలకలం రేపుతున్నాయి. టీఎన్జీవోస్ కాలనీలోని ఓ ఖాళీ ప్లాటులో అర్థరాత్రి తవ్వకాలు జరిపిన గుర్తు తెలియని వ్యక్తులు.. ఓ మూటను పక్కన పడేసి వెళ్లారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు..మూటలో మృతదేహం ఉందేమోనని తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికుల ఫిర్యాదు మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు... మూటను విప్పగా అందులో పలుగు, పార లభ్యమయ్యాయి. తవ్వకాలు జరిపిందెవ్వరు, ఎందుకోసం గుంత తీశారు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm