న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో కశ్మీరీ వేర్పాటువాది యాసిన్ మాలిక్‌ను ఢిల్లీ కోర్టు దోషిగా నిర్ధారించింది. కఠినమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఉన్న ఆరోపణలతో సహా అన్ని ఆరోపణలపై మాలిక్ గత మంగళవారం నేరాన్ని అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ నెల 25న యాసిన్‌మాలిక్‌కు న్యాయస్థానం శిక్ష ఖరారు చేయనుంది. అయితే ఎంత జరిమానా విధించాలో నిర్ణయించేందుకు అతని ఆర్థిక పరిస్థితిని అంచనా వేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)ని కూడా కోర్టు ఆదేశించింది.
స్వాతంత్ర్య పోరాటం పేరుతో జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు నిధులు సమీకరించడానికి మాలిక్ ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన నిర్మాణాన్ని, యంత్రాంగాన్ని ఏర్పాటు చేశాడని కోర్టు గతంలో పేర్కొంది. ఫరూఖ్ అహ్మద్ దార్ అలియాస్ బిట్టా కరాటే, షబ్బీర్ షా, మసరత్ ఆలం, ఎండీ యూసుఫ్ షా, అఫ్తాబ్ అహ్మద్ షా, అల్తాఫ్ అహ్మద్ షా, నయీం ఖాన్, ఎండీ అక్బర్ ఖండే, రాజా మెహ్రాజుద్దీన్ కల్వాల్, బషీర్‌లతో సహా ఇతర కాశ్మీరీ వేర్పాటువాదులపై కూడా కోర్టు అభియోగాలు మోపింది. వారిలో అహ్మద్ భట్, జహూర్ అహ్మద్ షా వతాలి, షబీర్ అహ్మద్ షా, అబ్దుల్ రషీద్ షేక్ మరియు నావల్ కిషోర్ కపూర్ ఉన్నారు.
ఈ కేసులో ప్రకటిత నేరస్థులుగా ప్రకటించిన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్‌లపై కూడా చార్జిషీటు దాఖలు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 19 May,2022 02:00PM