నోయిడా : సూపర్ మ్యాస్ స్టంట్ చేయబోయి ఓ బాలుడు మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. పార్థలా గ్రామంలో మే 14వ తేదీన సుర్జీత్(12) అనే బాలుడు సూపర్ మ్యాన్ స్టంట్ చేయాలనుకున్నాడు. అందుకోసం బాలుడు తన మెడకు ఓ గుడ్డ చుట్టుకుని వుడెన్ బాక్స్ నుంచి బయటకు దూకేందుకు ప్రయత్నించాడు. ఆ బాక్స్ అంచులో ఒకదానిలో గుడ్డ ఇరుక్కుపోవడంతో అది మెడకు చుట్టుకుంది. ఈ సమయంలో అతని నలుగురు చెల్లెళ్లు అక్కడే ఉన్నారు. ఆ దృశ్యాన్ని బాలుడి 11 ఏండ్ల చెల్లి ఓ మొబైల్ ఫోన్‌లో చిత్రీకరిస్తోంది. అయితే సుర్జీత్ నుంచి ఎలాంటి చలనం లేకపోవడంతో అతని చెల్లెళ్లు వారి తల్లికి సమాచారం అందించారు. అనంతరం బాధితుడిని సమీపంలో ఉన్న ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలుడు సూపర్‌మ్యాన్ వీడియోలను చూడటాన్ని ఇష్టపడతాడని, ఆ కామిక్ బుక్ హీరోని అనుకరించడానికి తరచుగా ప్రయత్నిస్తాడని బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm