హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్ - 4 పోస్టుల నియామక ప్రక్రియపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ మేరకు టీఎస్పీఎస్సీ ఛైర్మెన్ జనార్దన్‌రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ భేటీ అయ్యారు. 9,618 గ్రూప్- 4 పోస్టుల భర్తీపై చర్చిస్తున్నారు. ఈ నెల 29 వరకు వివరాలు కమిషన్‌కు పంపాలని అన్ని శాఖలకు సీఎస్ ఆదేశించారు. ఇప్పటికే గ్రూప్ -1తో పాటు పోలీసు కానిస్టేబుల్స్, ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm