న్యూఢలీ : ఇప్పటికే పంజాబ్‌లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. ఆ రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖడ్ గురువారం బీజేపీ చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కమలం పార్టీలో చేరారు. అనంతరం జాఖడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చిత్రీకరించినట్టుగా మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్‌పై అంత బలవంతుడేమీ కాదన్నారు. జేపీ నడ్డా మాట్లాడుతూ.. ఇంతటి అపారమైన రాజకీయ అనుభవం ఉన్న నేత బీజేపీలో చేరడం సంతోషించదగ్గ విషయమన్నారు. పంజాబ్‌లో డ్రగ్స్, ఉగ్రవాదానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయని.. జాతీయ ఆసక్తి ఉన్న వ్యక్తులు బిజెపిలో చేరడం చాలా ముఖ్యమన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm