అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారిగా ముకేష్ కుమార్ మీనా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గా కొనసాగుతున్న కె. దయానంద్ నుంచి చార్జ్ తీసుకున్నారు. ముకేష్.. సీనియర్ ఐఏఎస్ అధికారిగా వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం ఆయన వాణిజ్య పన్నులు, చేనేత జౌళి, ఆహార పరిశ్రమల శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. గతంలో రాజ్ భవన్ కార్యదర్శిగా పనిచేసి గవర్నర్ అభినందనలు అందుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm