అమరావతి : క్రికెట్ బెట్టింగ్‌లో టీడీపీ నేతను తూర్పు గోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందన్న సమాచారం అందుకున్న పోలీసులు వ్యూహం ప్రకారం బెట్టింగ్ శిబిరంపై మూకుమ్మడిగా దాడి చేశారు. అనంతరం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి సత్య కూడా ఉన్నాడు. నిందితుల వద్ద నుంచి రూ. 2. 5 లక్షలు, లాప్‌టాప్, అకౌంట్స్ బుక్ లను పోలీసులు సీజ్ చేశారు. గత నెలలో ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రూ. 52 లక్షలు బెట్టింగ్‌కు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm