హైదరాబాద్ : ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంతటి సంచలన విజయం నమోదు చేసిందో తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్ వర్క్స్‌కి పెద్ద పీట వేశారు. సినిమాలో ఓ సన్నివేశంలో పులితో ఎన్టీఆర్ చేసే పోరాటం, మరో సన్నివేశంలో రామ్‌చరణ్-పులి ఫైట్, చరణ్‌పై పాము దాడి చేయడం.. ఇలాంటి ఎన్నో షాట్స్‌కి వీఎఫ్‌ఎక్స్ ఉపయోగించారు. అయితే, ఆయా సన్నివేశాల్లో AlzahraVFX సంస్థ విజువల్ ఎఫెక్ట్స్ ఎలా క్రియేట్ చేసిందో తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం ఆకట్టుకుంటోంది.
Mon Jan 19, 2015 06:51 pm