హైదరాబాద్ : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతా పై 2021లో ట్విట్టర్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన వేరే పేరు(ట్విట్టర్ హ్యాండిల్)తో ట్విట్టర్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే అది ట్విట్టర్ ఆ ఖాతాను కూడా నిషేధించింది. ఈ మేరకు అమెరికాకు చెందిన హఫ్ పోస్ట్ అనే మీడియా సంస్థ ఈ దిశగా ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిన తర్వాత ట్విట్టర్ వేదికగా తన మద్దతుదారులను రెచ్చగొట్టిన ట్రంప్ అమెరికా రాజధానిపై దాడికి దిగేలా చేశారన్న ఆరోపణలతో 2021లో ఆయనను ట్విట్టర్ నిషేధించింది. అయితే తన భావాలను వ్యక్తీకరించేందుకు ట్రంప్ ట్విట్టర్‌కు పోటీగా ట్రూత్ సోషల్ పేరిట వేరే వేదికను ప్రారంభించారు. దీని ద్వారా ఆయన తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అయితే తాజాగా @PresTrumpTS పేరిట ఓ ట్విట్టర్ ఖాతాను తెరిచారు. ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ పోస్ట్ చేస్తున్న విషయాలన్నింటినీ ట్విట్టర్‌లోనూ ఆ ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ వస్తున్నాయి. ఇది గమనించిన ట్విట్టర్.. ఈ ఖాతాను కూడా నిషేధించింది. రెండు రోజుల క్రితం ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్ట్ చేసిన అంశాల్లో 21 అంశాలు ట్విట్టర్‌లోనూ కనిపించాయట. అంతేకాకుండా ఈ ట్వీట్లకు ప్లీజ్ ఫాలో అండ్ రీ ట్వీట్ అంటూ ట్రంప్ రిక్వెస్ట్‌లు కూడా పోస్ట్ చేశారని తెలిసింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 19 May,2022 04:24PM