హైదరాబాద్ : ఆదిలాబాద్‌లో నాగ్‌పూర్ రోడ్డుపై గురువారం ఎడ్లబండ్లతో రైతులు రాస్తారోకో నిర్వహించారు. సీసీఐ యంత్ర సామగ్రిని తుక్కు కింద విక్రయించాలన్న కేంద్ర నిర్ణయంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సీసీఐ ఉద్యోగులు, సిబ్బంది కూడా సీసీఐ ప్రధాన ద్వారం ముందు ఆందోళన చేపట్టారు. సీసీఐ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నష్టపోవాల్సి వస్తుందని నిర్వాసితులు పేర్కొన్నారు. ఈ -టెండర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్థానికులకు ఉపాధి లభిస్తుందని అప్పట్లో భూములు ఇచ్చామని, ఇపుడు ఫ్యాక్టరీని మూసివేసేలా తీసుకుంటున్న చర్యలను అడ్డుకుంటామని రైతులు అంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm