విశాఖపట్నం : ఏపీలోని విశాఖపట్నంలో డాక్టర్ వైఎస్సాఆర్ క్రికెట్ స్టేడియం వేదికగా జూన్ 14 ఇండియా-సౌతాఫ్రికా మధ్య టీ20 మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ లో భాగంగా ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఆ రోజు రాత్రి 7 గంటల నుంచి డే అండ్ నైట్ మ్యాచ్ జరగనుంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా మ్యాచ్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఏసీఏ సీఈవో ఎం. వెంకట్ శివారెడ్డి తెలిపారు.
బిసిసిఐకి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలియజేసింది. తాజాగా విశాఖ క్రికెట్ స్టేడియంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో నిర్వాహకులు మాట్లాడుతూ.. 27వేల మంది ఈ స్టేడియం కెపాసిటీ అని, ఈ మ్యాచ్ జరిగే రెండు వారాల ముందు నుంచి టికెట్లను ఆన్ లైన్ లో అమ్మకాలు చేపడతామని తెలిపారు. బ్లాక్ టికెటింగ్ అరికట్టేందుకు ఆన్ లైన్ ద్వారా టికెట్లు విక్రయిస్తామని చెప్పారు. టిక్కెట్ ధరలు రూ. 250 నుండి రూ. 5,000 వరకు ఉంటాయని తెలిపారు.
దాదాపు 29 నెలల విరామం తర్వాత విశాఖపట్నం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. వైజాగ్ ఇప్పటి వరకు 10 వన్డేలు, నాలుగు టీ20లు, రెండు ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 19 May,2022 05:31PM