గాంధీనగర్ : గుజరాత్ లో పురావస్తు తవ్వకాల్లో ఓ అసంపూర్ణ అస్థిపంజరం లభ్యమైంది. ఇది వందల ఏండ్ల నాటిదిగా భావిస్తున్నారు. వాద్ నగర్ పట్టణంలోని ఘస్కోల్ ప్రాంతంలో తవ్వకాలు సాగించిన భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) శాస్త్రవేత్తలు ఈ అస్థిపంజరాన్ని వెలికి తీశారు. అది ఓ మహిళ అస్థిపంజరంగా గుర్తించారు. అయితే డీఎన్ఏ పరీక్షల్లో గుజరాత్ లోని అత్యధిక ప్రజల డీఎన్ఏతో ఆ మహిళ అస్థిపంజరం డీఎన్ఏ సరిపోలింది. ఆ లెక్కన సదరు స్త్రీమూర్తి గుజరాతీయులకు అమ్మలగన్న అమ్మ అయివుంటుందని, ఆ మహిళ వారసుల నుంచే గుజరాత్ జనాభా విస్తృతమై ఉంటుందని ఓ అంచనా వేస్తున్నారు.
లక్నో డీఎన్ఏ ల్యాబ్ అధిపతి డాక్టర్ నీరజ్ రాయ్ మాట్లాడుతూ.. సాధారణ గుజరాతీ వ్యక్తుల్లో ఉండే డీఎన్ఏ, మహిళ డీఎన్ఏ ఒకేలా ఉన్నాయన్నారు. ఈ అస్థిపంజరం ద్వారా గుజరాత్ ప్రజల పుట్టుక మూలాలకు సంబంధించి కీలక సమాచారం లభించినట్టయిందని పేర్కొన్నారు. మహిళ అస్థిపంజరం 4వ శతాబ్దానికి చెందినదిగా నిర్ధారణ అయినట్టు తెలిపారు. ఆ మహిళకు ఎలాంటి జబ్బులు లేవన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 19 May,2022 05:49PM