హైదరాబాద్ : మథురలోని శ్రీకృష్ణుడి జన్మస్థలంలో ఉన్న షాహీ ఈద్గా మసీదును తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను మథుర జిల్లా కోర్టు విచారణకు గురువారం స్వీకరించింది. అనంతరం ఇరు వర్గాల వాదనలు విన్న జడ్జి రాజీవ్ భారతి తీర్పును రిజర్వ్ చేస్తున్నామని తెలిపారు. లఖన్ వూ నివాసి, కృష్ణుడి భక్తురాలు రంజనా అగ్నిహోత్రి రెండేండ్ల క్రితం ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత దీనిపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం శ్రీ కృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు కేసు సీనియర్ డివిజన్ కోర్టులో నడుస్తుంది.
లఖ్నవూ నివాసి రంజనా న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్నారు. శ్రీ కృష్ణ జన్మభూమి ప్రాంతంలో షాహీ ఈద్గా మసీదును తొలగించాలని 2020 సెప్టెంబర్ 25న మథుర సివిల్ కోర్టులో రెండు సార్లు ఆమె పిటిషన్ దాఖలు చేయగా తిరస్కరణకు గురైంది. దాంతో పిటిషనర్లు మథుర జిల్లా కోర్టును ఆశ్రయించారు. మొత్తం కృష్ణ జన్మభూమి కాంప్లెక్స్ 13.37 ఎకరాల్లో విస్తరించి ఉండగా.. అదే ప్రాంగణంలో మసీదు నిర్మించారని పిటిషన్దారులు ఆరోపించారు. మరోవైపు, షాహీ ఈద్గా మసీదు, యూపీ సెంట్రల్ సున్నీ వక్ఫ్ బోర్డు ముస్లింల పక్షాన న్యాయవాదులు తన్వీర్ అహ్మద్, నీరజ్ లు వాదిస్తున్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న జడ్జి రాజీవ్ భారతి తీర్పును రిజర్వ్ చేస్తున్నామని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 19 May,2022 06:32PM