హైదరాబాద్ : తెలంగాణలో గురువారం పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ కాగా తాజాగా పలువురు డీఎస్పీలు కూడా బదిలీలు అయ్యారు. వేములవాడ డీఎస్పీగా కే నాగేంద్ర చారి, కామారెడ్డి (ఆర్) ఎల్లారెడ్డి డీఎస్పీగా ఏ శ్రీనివాసులు, అచ్చంపేట్ డిఎస్పీగా కే కృష్ణ కిషోర్ లు నియమితులయ్యారు. అలాగే నాగర్కర్నూల్ డీఎస్పీగా బీ మోహన్ కుమార్, నిర్మల్ డీఎస్పీగా ఎల్ జీవన్ రెడ్డి, హనుమకొండ (వరంగల్) ట్రాఫిక్ ఏసీపీగా ఏ మధుసూదన్, ఎల్బీనగర్ ఏసీపీగా జ.అంజయ్యలను ప్రభుత్వం నియమించింది.
Mon Jan 19, 2015 06:51 pm