హైదరాబాద్ : సరైన పత్రాలు లేని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలంటూ సబ్ రిజిస్ట్రార్‌ను బెదిరింపులకు గురి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకెళ్తే.. నాగరాజ్ అనే వ్యక్తి హైదరాబాద్ లోని కూకట్‌పల్లిలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలోకి వెళ్లి సరైన పత్రాలు లేని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలంటూ సబ్ రిజిస్ట్రార్‌ను ఒత్తిడి చేశాడు. అంతేకాదు పెన్ కెమెరాతో న్యూసెన్స్ చేశారు. దాంతో సబ్ రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు నిందితుడు నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm