నవతెలంగాణ-చేర్యాల
సిద్దిపేట జిల్లా చేర్యాల మండల పరిధిలోని రాంపురం గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో ప్రస్తుతం సర్పంచ్ గా కొనసాగుతున్న రంగు శివ శంకర్ ఓట్ల లెక్కింపులో అవకతవకలకు పాల్పడి తనపై 6 ఓట్ల తేడాతో గెలిచారని ఆయన సమీప ప్రత్యర్థి దినేష్ తివారి కోర్టును ఆశ్రయించారు. అయితే దినేష్ తివారి పిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలతో సర్పంచ్ ఎన్నిక ఓట్లను మండల కేంద్రం లోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ నెల 21న, ఉదయం 11 గంటల 30 నిమిషాలకు తిరిగి లెక్కించనున్నట్లు స్థానిక ఎంపిడివో తారిక్ అన్వర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm