హైదరాబాద్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్.. ప్లేఆఫ్స్ భవితవ్యం తేలేది నేడే! ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టేబుల్ టాపర్స్ గుజరాత్‌తో పోరుకు సిద్ధమైంది. వాంఖడే వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ సారధి హార్దిక్ పాండ్యా.. ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. అలాగే తమ జట్టులో అల్జారీ జోసెఫ్ స్థానంలో లోకీ ఫెర్గూసన్ ఆడుతున్నట్లు తెలిపాడు. తమ జట్టులో కూడా ఒక మార్పు చేశామని ఆర్సీబీ సారధి ఫాఫ్ డుప్లెసిస్ వెల్లడించాడు. మహమ్మద్ సిరాజ్ స్థానంలో సిద్ధార్థ్ కౌల్ ఆడుతున్నట్లు చెప్పాడు.
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, లోకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమీ, యష్ దయాళ్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పటీదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్, హర్షల్ పటేల్, వానిందు హసరంగ, సిద్ధార్థ్ కౌల్, జోష్ హాజిల్‌వుడ్.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 19 May,2022 07:24PM