హైదరాబాద్: మరి కొన్ని నెలల్లో ఫిఫా ఫుట్ బాల్ సంరంభం అభిమానులను ఉర్రూతలూగించనుంది. నవంబరు 21 నుంచి డిసెంబరు 18 వరకు ఖతార్ లో వరల్డ్ కప్ సాకర్ టోర్నీ జరగనుంది. ఈ ప్రపంచ పోటీలకు ఆసియా ఆతిథ్యమిస్తుండడం విశేషం. కాగా, ఈసారి ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్ లకు మహిళా రిఫరీలను కూడా నియమించనున్నారు. వరల్డ్ కప్ ఈవెంట్ లో మహిళా రిఫరీలకు బాధ్యతలు అప్పగించడం ఇదే తొలిసారి. టోర్నీకి ఆతిథ్యమిస్తున్న ఖతార్ వంటి అరబ్ దేశాల్లో మహిళలపై ఎన్ని ఆంక్షలు ఉంటాయో తెలియంది కాదు. ఈ నేపథ్యంలో, ఫిఫా తెగువతో కూడిన నిర్ణయం తీసుకుందనే భావించాలి. ఈ టోర్నీలో ముగ్గురు మహిళా రిఫరీలు, ముగ్గురు మహిళా అసిస్టెంట్ రిఫరీలు బాధ్యతలు నిర్వర్తించనున్నట్టు ఫిఫా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఫిఫా పురుషుల జూనియర్స్, సీనియర్స్ పోటీలను మహిళా రిఫరీలతో నిర్వహించాలన్న ఆలోచన ఇప్పటిది కాదని ఫిఫా రిఫరీస్ కమిటీ చైర్మన్ పియర్లూగి కొల్లినా వెల్లడించారు.
స్టెఫానీ ఫ్రాపార్ట్ (ఫ్రాన్స్), సలీమా ముకాన్సంగా (రువాండా), యోషిమి యమషితా (జపాన్) ఫిఫా వరల్డ్ కప్-2022 టోర్నీలో రిఫరీలుగా ఎంపికయ్యారు. నౌజా బాక్ (బ్రెజిల్), కరేన్ డియాజ్ మెడీనా (మెక్సికో), కాథరిన్ నెస్బిట్ (అమెరికా) అసిస్టెంట్ కోచ్ లు గా వ్యవహరించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 19 May,2022 08:59PM