హైదరాబాద్: బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ధాటిగా ఆడుతున్న డేవిడ్ మిల్లర్ (34) అవుటయ్యాడు. హసరంగ వేసిన 17వ ఓవర్లో మిల్లర్ పెవిలియన్ చేరాడు. హసరంగ డెలివరీని నేరుగా కొట్టేందుకు ప్రయత్నించిన మిల్లర్.. బౌలర్‌కే క్యాచ్ ఇచ్చాడు. తన మీదకు వచ్చేసిన బంతిని హసరంగ చక్కగా అందుకోవడంతో మిల్లర్ మైదానం వీడాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే తన ఇన్నింగ్స్ వేగం పెంచుతున్న మిల్లర్ అవుటవడంతో.. తెవాటియా క్రీజులోకి వచ్చాడు. గుజరాత్ జట్టు 123 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.
Mon Jan 19, 2015 06:51 pm