శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగ మార్గం కుప్పకూలింది. రాంబన్ జిల్లాలోని ఖూనీ నాలా వద్ద జమ్ము- శ్రీనగర్ హైవేపై నిర్మిస్తున్న సొరంగ మార్గంలోని కొంతభాగం గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కూలిపోయింది. దీంతో ఏడుగురి ఆచూకీ లభించకుండా పోయింది. దీంతో వారిని రక్షించడానికి స్థానిక పోలీసులు, సైనికులు సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే ఇప్పటికరకు సొరంగం మార్గం నుంచి ఒకరిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చామని రాంబన్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఇంకా ఆరుగురిని రక్షించడానికి ఆ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నదని చెప్పారు. సొరంగమార్గం కూలిపోవడంతో రెండు వైపులా ట్రాఫిక్‌ను నిలిపివేశామని వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm