పటియాలా: పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ నేడు పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు. 1988 నాటి ర్యాష్ డ్రైవింగ్ కేసులో సుప్రీంకోర్టు సిద్ధూకి ఏడాది పాటు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఆయన పటియాలా పోలీసులకు లొంగిపోయే అవకాశం ఉన్నది. కోర్టు తీర్పును గౌరవిస్తానని, పోలీసులకు లొంగిపోతానని సూచనప్రాయంగా ప్రకటించిన ఆయన అమృసర్ నుంచి పటియాలా లోని ఇంటికి చేరుకున్నారు. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాలు ఇంకా తమకు అందలేదని, శుక్రవారం ఉదయం ఛండీగఢ్ కోర్టు నుంచి పటియాలా పోలీస్‌స్టేషన్‌కు వస్తాయని అధికారులు తెలిపారు. అనంతరం సమన్లను సిద్ధూకి అందించి లొంగిపోవాలని కోరుతామన్నారు. అరెస్టు చేసిన వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక దవాఖానకు తరలిస్తామని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm