హైదరాబాద్: నల్లగొండ జిల్లా పర్యటనకు వెళ్తోన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మెట్టుగూడ వద్ద ఘనస్వాగతం లభించింది. రిజర్వేషన్ల కల్పన కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా పవన్‌కు గిరిజన సంఘాల నేతలు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం జనసేనాని మీడియాతో మాట్లాడుతూ... పోలీసులు ఉద్యోగాల నియామకాల్లో వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. 10శాతం గిరిజన రిజర్వేషన్లు కోసం జనసేన పోరాటం చేస్తోందని తెలిపారు. నిరుద్యోగులు, గిరిజనులకు జనసేన మద్దతుగా నిలబడుతోందన్నారు. విద్యార్థులు తెలంగాణ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm