హైదరాబాద్ : గుంటూరు జీజీహెచ్లో సీపీఐ ఆందోళనకు దిగింది. సాముహిక లైంగికదాడి బాధితురాలు పరామర్శకు సీపీఐ వచ్చింది. అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా సీపీఐ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. బాధితులకు అండగా వచ్చే వారిపై పోలీసులు ప్రతాపం చూపించడం సిగ్గుచేటు అన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ సీపీఐ పోరాటం కొనసాగుతుందని సీపీఐ పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm