హైదరాబాద్ : మూడేళ్ల కిందట తెలంగాణలో దిశ లైంగికదాడి కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులు ఎన్ కౌంటర్ లో మరణించగా, నిజాలు నిగ్గుతేల్చేందుకు సుప్రీంకోర్టు జస్టిస్ వీఎస్ సిర్పూర్కర్ కమిషన్ ఏర్పాటు చేసింది. తాజాగా, సిర్పూర్కర్ కమిషన్ 387 పేజీల నివేదికను అత్యున్నత న్యాయస్థానానికి అందజేసింది. ఇందులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది.
దిశ నిందితుల ఎన్ కౌంటర్ కు సంబంధించి పోలీసుల వాదన నమ్మకశ్యంగా లేదని సిర్పూర్కర్ కమిషన్ పేర్కొంది. దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకం అని వివరించింది. దిశ ఘటన పట్ల ప్రజల్లో నెలకొన్న ఆగ్రహావేశాలను చల్లార్చేందుకు, తక్షణ న్యాయం చేశామన్న అభిప్రాయం కలిగించేందుకు నిందితులను కాల్చి చంపినట్టు కమిషన్ వెల్లడించింది. నిందితులను కస్టడీలోకి తీసుకున్నప్పటి నుంచి ఉన్న అధికారులు కాకుండా, ఘటన సమయంలో వేరే అధికారులు ఉన్నారని ఆరోపించింది. మొత్తం పది మంది పోలీసులపై విచారణ జరపాలంటూ వారి పేర్లను తన నివేదికలో పొందుపరిచింది. కాగా, సుప్రీంకోర్టు ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. అదే సమయంలో, సిర్పూర్కర్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయొద్దన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని కూడా తోసిపుచ్చింది. ఈ నివేదికపై తెలంగాణ హైకోర్టే నిర్ణయం తీసుకుంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 20 May,2022 03:04PM