హైదరాబాద్ : సమాజ్‌వాది పార్టీ నేత, ఎమ్మెల్యే ఆజంఖాన్ శుక్రవారం సీతాపూర్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు రాంపూర్ సరిహద్దుల వద్దకు చేరుకున్న ఆయనకు పలువురు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన ఇంటికి చేరుకోనున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, నాయకులతో సహా భారీ సంఖ్యలో మద్దతుదారులు అజంఖాన్ ఇంటి వద్ద వేచి ఉన్నారు. ఇదిలా ఉండగా.. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో ఆజంఖాన్‌కు వ్యతిరేకంగా 85 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో బెయిల్ రావడానికి దాదాపు రెండున్నరేళ్లు పట్టింది.
Mon Jan 19, 2015 06:51 pm