హైదరాబాద్ : వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నాయకురాలు, సినీ నటి దివ్యవాణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు గుడివాడ అంటే దివంగత ఎన్టీఆర్ గుర్తుకు వచ్చేవారని... అలాంటి గుడివాడను క్యాసినోవాడగా కొడాలి నాని మార్చాడని విమర్శించారు. కొడాలి నాని నోరు విప్పితే బూతులు తప్ప మరేమీ రావని అన్నారు. రాజకీయాల కోసం, పదవుల కోసం బూతులు మాట్లాడితే... పంచలు ఊడదీసి కొడతామని హెచ్చరించారు. క్యాసినో నాని ముందు గుడివాడలో రోడ్లు వేసి చూపించాలని సవాల్ విసిరారు. గుడివాడ గడ్డను టీడీపీ అడ్డాగా మారుస్తామని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm