హైదరాబాద్ : విశ్వనటుడు కమల్ హాసన్ ట్రెండ్‌కు తగ్గట్టుగా కథలను ఎంచుకుంటూ యువ హీరోలకు ధీటుగా సినిమాలను చేస్తుంటాడు. ఈయన నుంచి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం 'విక్రమ్'. 'మాస్టర్' ఫేం లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కింది. గతేడాది విడుదలైన టైటిల్ టీజర్ నుంచి ఇటీవలే విడుదలైన ట్రైలర్ వరకు ప్రతి ఒక్కటి ప్రేక్షకుల అంచనాలను అంతకంతకూ పెంచుతున్నాయి. ఈ క్రమంలో 'విక్రమ్' చిత్రం ఒకప్పటి కమల్‌ను గుర్తుచేస్తుంది. కాగా ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ను నేడు విడుదల చేశారు. ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను రామ్‌చరణ్ శుక్రవారం సాయంత్రం 5.00 గంటలకు విడుదల చేశారు. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ఠ మూవీస్ ద్వారా విడుదల చేస్తున్నారు.ఈ చిత్రంలో ఫాహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా సూర్య కూడా ఈ సినిమాలో ఉండనున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇటీవలే విడుదలైన తమిళ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. కమల్ హాసన్‌కు 232వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆర్. మహింద్రన్‌తో కలిసి కమల్‌హాసన్ స్వీమ నిర్మాణంలో తెరకెక్కించాడు. ఈ చిత్రం జూన్ 3న తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకానుంది.
Mon Jan 19, 2015 06:51 pm