హైదరాబాద్ : షీనాబోరా మత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాని ముఖర్జీ జైలు నుంచి విడుదలయ్యారు. ముంబైలోని బైకులా జైలు నుంచి ఆరున్నర సంవత్సరాల తర్వాత శుక్రవారం బయటకు వచ్చారు. సుప్రీం కోర్టు రెండు రోజుల కిందట ఇంద్రాణికి బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం ఇంద్రాణి ముఖర్జీ మాట్లాడుతూ సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. షీనాబోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఇంద్రాణి ముఖర్జీ గత ఆరున్నర సంవత్సరాలుగా జైలులో ఉన్నారు. షీనాబోరా హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm