"తెలంగాణ ఉద్యమానికి పాటలే ప్రాణమని యాది మరిస్తివా కేసీఆర్..?
— Revanth Reddy (@revanth_anumula) May 20, 2022
పాటతో నిన్ను ప్రశ్నిస్తున్నందుకు కేసులు పెట్టి అణచివేస్తావా..?
ఈ వేధింపులకు మేం భయపడం..
నీ అరాచకాలను ప్రశ్నించేందుకు గొంతెత్తుతూనే ఉంటాం…!#WeStandWithNarasimha#WeStandWithMahipal#ArrestMeKcr pic.twitter.com/3llVhEROr2
హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నిస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శుక్రవారం ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. అందులో కేసీఆర్ సర్కారు తీరును ప్రశ్నిస్తూ తెలంగాణకు చెందిన నరసింహ అనే గాయకుడు పాడిన పాటను ఆయన తన ట్వీట్‌కు జత చేశారు. తెలంగాణ ఉద్యమానికి పాటలే ప్రాణమని యాది మరిస్తివా కేసీఆర్ అంటూ ఆయన ఓ కామెంట్ కూడా తన ట్వీట్‌కు యాడ్ చేశారు. పాటతో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నందుకు కేసులు పెట్టి అణచివేస్తారా? అంటూ ప్రశ్నించిన రేవంత్ రెడ్డి, ఆ తరహా వేధింపులకు తాము భయపడబోమని వెల్లడించారు. అంతేకాకుండా మీ అరాచకాలను ప్రశ్నించేందుకు గొంతెత్తూనే ఉంటామని కూడా రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ తీరును ప్రశ్నిస్తూ పాట పాడిన నరసింహతో పాటు మహిపాల్‌కు తాము అండగా ఉంటామని రేవంత్ ప్రకటించారు. అరెస్ట్ మీ కేసీఆర్ అన్న ఓ హ్యాష్‌ట్యాగ్‌ను కూడా రేవంత్ తన ట్వీట్‌కు యాడ్ చేశారు.