నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆరుగురు ఎస్ఐలను బదిలీ చేస్తూ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కె ఆర్ నాగరాజు ఉత్తర్వులను జారీ చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు ఆరుగురు ఎస్సైలకు ఉత్తర్వుల జాబితాను శుక్రవారం విడుదల చేశారు. అందులో భాగంగా ప్రస్తుతం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ రెండవ ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న యాదగిరి గౌడ్ ను మాక్లూర్ పోలీస్స్టేషన్కు, నవీపేట్ అండ్ అటాచ్ మాక్లూర్ పోలీస్స్టేషన్ ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న పెంటా గౌడ్ సారను నిజామాబాద్ సిసి ఆర్ బీ కి, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ప్రదీప్ కుమార్ గాజుల ను ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్సై ఒకటిగా, గంగుల శ్రవణ్ కుమార్ ప్రస్తుతం భీమ్గల్ పోలీస్స్టేషన్ అట చుట్టూ వి ఆర్ నిజాంబాద్ విధులు నిర్వహిస్తున్న తనను ఒకటవ పోలీస్స్టేషన్ ఎస్ఐ ఒకటిగా, సాయికుమార్ తాళ్ల నిజామాబాద్ ఒకటవ పోలీస్స్టేషన్ ఎస్ఐ 1 గా విధులు నిర్వహిస్తున్న ఆయనను ఆరవ పోలీస్ స్టేషన్ ఎస్సైగా, ప్రస్తుతం ఆర్ ఓ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ ఆంజనేయులు ట్రాఫిక్ ఎస్ఐ గా బదిలీ చేస్తూ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కె ఆర్ నాగరాజు ఉత్తర్వులు జారీ చేశారు.