బెంగళూరు : వివాహేతర సంబంధం విషయంలో తనను మందలించాడని సోంత తమ్మున్నే హత మార్చింది ఓ అక్క. ఈ ఘటన కర్ణాటకలోని హుబ్బలి సిటీలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. బసవ్వ అనే మహిళకు శంభూలింగ అనే వ్యక్తితో 18 ఏండ్ల కిందట వివాహం జరిగింది. అయితే బసవ్వ గత ఆరు నెలలుగా భోపాల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే ఈ విషయం బసవ్వ భర్తకు తెలిసింది. కానీ పరువు పోతుందేమోనని వారిని ఏం అనలేకదు. అయితే ఈ విషయం బసవ్వ తమ్ముడికి కూడా తెలిసింది. దీంతో అక్కను తమ్ముడు మందలించాడు. తమ్ముడిపై పగను పెంచుకున్న అక్క.. ప్రియుడు భోపాల్ తో కలిసి అతడిని చంపేందుక పథకం పన్నింది. ఇద్దరూ అతడిని కత్తితో తల నరికి చంపారు. అనంతరం నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm