కొలంబో : శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. తాజాగా ఇంధన కొరత కారణంగా రవాణా సేవలు నిలిచిపోవడంతో విద్యా సంస్థలను మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. అలాగే, అత్యవసరమైన సేవలను నిర్వహించే వారిని మినహాయించి మిగితా ప్రభుత్వ ఉద్యోగులెవరూ కార్యాలయాలకు రావాల్సిన పనిలేదని ప్రభుత్వ పాలనా విభాగం సూచించింది. దేశ అవసరాలకు సరిపడా ఇంధన నిల్వలు లేకపోవడం, దిగుమతి చేసుకునేందుకు అవసరమైన సొమ్ము లేకపోవడంతో అంతర్జాతీయ సంస్థలు, విదేశీ సాయం కోసం శ్రీలంక ఆశగా ఎదురుచూస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm