పారిస్ : 75వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ ఫ్రాన్స్‌లో ఘనంగా జరుగుతున్నది. అందుకోసం భారతదేశం సౌత్ హీరోయిన్లు పూజా హెగ్డే, తమన్నా, నయన తారలు కూడా విచ్చేశారు. అయితే ఈ వేడుకల్లో పూజాహెగ్డేకు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఈ వేడుక కోసం ఆమె సిద్ధం చేసుకున్న నగలు, దుస్తులు, మేకప్ సామాన్ల బ్యాగ్‌లు పోయాయి. ఈ విషయాన్ని ఆమె విదేశీ మీడియాకు తెలిపింది.
ఆమె మాట్లాడుతూ.. 'తొలిసారి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు ఆహ్వానం అందడంతో చాలా సంతోషపడ్డాను. ఇక్కడ రెడ్ కార్పెట్‌పై మెరిసేందుకు బ్యూటీ ప్రొడక్ట్స్, ఫ్యాషన్ వేర్ దుస్తులను నా టీం స్పెషల్‌గా డిజైన్ చేసింది. అయితే ఫ్రాన్స్ వచ్చాక ఆ బ్యాగులు కనిపించకుండ పోయాయి. ఇండియా ఎయిర్‌పోర్టులోనే బ్యాగ్‌లు పోయాయి. ఎయిర్‌పోర్టులో నా బ్యాగ్స్ చెకిన్ అయ్యాయి. కానీ అందులో నా మేకప్, దుస్తులకు సంబంధించిన బ్యాగ్స్ మాత్రం కనిపించలేదు. తీరా ఫ్రాన్స్‌లో ల్యాండ్ అయ్యాకే అసలు విషయం తెలిసింది. దాంతో నేను, నా టీం ఆందోళనకు గురయ్యాం. అయితే భారత్ లో కొన్న బంగారు నగలు నా హ్యాండ్ బ్యాగులో ఉన్నాయి. దాంతో ఊపిరి పీల్చుకున్నాను. ఆ తర్వాత నా టీంకి మేకప్ సామన్లు, దుస్తులు కొని తీసుకురమ్మన్నాను. వెంటనే వారు అవసరమైన వస్తువులన్నీ కొని తెచ్చారు. అయితే బ్యాగ్స్ మిస్ అయ్యేసరికి టెన్షన్‌లో ఆ రోజంత నాతో పాటు నా టీం ఎవరు కూడా ఏం తినలేదు. రాత్రి రెడ్ కార్పెట్ వాక్ ముగిసిన తర్వాతే అందరం తిన్నాం` అని తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 21 May,2022 09:14AM