హైదరాబాద్ : స్నేహితుల సలహాలతో ఇద్దరు చిన్నారులు వారి తల్లిదండ్రులు ఇంట్లో దాచిన రూ.4 లక్షలు కొట్టేసి 20 రోజుల్లో ఖర్చు చేశారు. ఈ ఘటన జీడిమెట్ల ఠాణా పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకెళ్తే.. ఎస్.ఆర్.నాయక్ నగర్‌కు చెందిన దంపతులు నెల కిందట రూ.4 లక్షలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. అది గమనించిన 9, 8 ఏండ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు (సోదరులు) సమీపంలో ఉన్న వారి స్నేహితుల (13, 14 ఏండ్లు)తో ఈ విషయాన్ని చెప్పారు. ఆ ఇద్దరు స్నేహితులు వీరిద్దరికీ మాయమాటలు చెప్పి ఇంట్లో దాచిన నగదును కొంచెం కొంచెం తీసుకొచ్చేలా పథకం చెప్పారు. స్నేహితులు చెప్పిన మాట విన్న చిన్నారులిద్దరూ తమ తల్లిదండ్రులు దాచిన డబ్బును కాజేస్తూ.. ఆ స్థానంలో నకిలీ నోట్లను పెట్టేవారు. అలా తీసుకొచ్చిన డబ్బుతో అందరూ జల్సాలు చేస్తూ స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ వాచీలు, గేమింగ్ సెంటర్‌లు, రెస్టారెంట్‌లకు వెళ్లారు. 20 రోజుల తర్వాత చిన్నారుల తల్లిదండ్రులు ఇంట్లో దాచిన డబ్బును పరిశీలించగా తక్కువగా కనిపించింది. అలాగే నకిలీ కరెన్సీగా తేలడంతో వారు షాకయ్యారు. తమ పిల్లలను గట్టిగా అడగడంతో వారు జరిగిన విషయాన్ని చెప్పారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మైనర్లకు నకిలీ కరెన్సీ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో విచారణ చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్ కె.బాలరాజు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 21 May,2022 09:24AM