లక్నో: తల్లి చనిపోగా ఆమె మృతదేహంలో ఆమె కుమార్తె దాదాపు పది రోజుల పాటు గడిపింది. ఆ ఇంట్లో నుంచి వస్తున్న దుర్వాసనను రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగింది.
వివరాల్లోకెళ్తే.. ఇందిరా నగర్‌లో నివసించే రిటైర్డ్ హెచ్‌ఏఎల్ ఇంజనీర్, సునీతా దీక్షిత్ ఇటీవలే మృతి చెందినట్టు తెలిసింది. అయితే ఆమె 26 ఏండ్ల కూతురు అంకితా దీక్షిత్ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.
ఇలా దాదాపు 10 రోజులు గడిచాయి. దాంతో మృతదేహం దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోగా ఇంటికి తాళం వేసి ఉంది. లోపలి నుంచి యువతి మాటలు వినిపించడంతో పోలీసులు తలుపు తట్టారు. అయితే డోర్ తెరిచేందుకు అంకిత నిరాకరించింది. తరువాత, తలుపు పగులగొట్టడానికి ఒక వడ్రంగిని పిలిచారు. ఇంట్లోని ఓ గదిలో చితికిపోయిన అమ్మాయిని గుర్తించిన పోలీసులు ఆశ్చర్యపోయారు. లోపల అంకిత ఒక గదిలో ఉండగా, మరో గదిలో ఆమె తల్లి మృతదేహం కనిపించింది. అంకిత మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు గుర్తించారు. తొలుత మాట్లాడలేకపోయిన అంకిత.. ఆ తర్వాత పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. దాంతో ఆమెను చనిపోయిన మహిళ కుమార్తెగా గుర్తించారు. సునీత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు. ఆమె మరణానికి కారణాలు తెలియరాలేదు. సునీత దీక్షిత్ పదేండ్ల క్రితమే భర్త రజనీష్ దీక్షిత్ నుంచి విడాకులు తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 21 May,2022 10:25AM