న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,323 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే 25 మంది కరోనాతో మృతి చెందగా 2,346 మంది కోలుకున్నారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,31,34,145కు చేరుకున్నాయి. అందులో 4,25,94,801 మంది బాధితులు కోలుకోగా 5,24,348 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 14,996 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా కేరళలో 556 కేసులు ఉండగా, ఢిల్లీలో 530, మహారాష్ట్రలో 311, హర్యానాలో 262, ఉత్తరప్రదేశ్‌లో 146 చొప్పున కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఈ ఐదు రాష్ట్రాల్లోనే 77.7 శాతం కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.75 శాతం, మరణాలు 1.22 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక శుక్రవారం ఒకే రోజు 15,32,383 మందికి వ్యాక్సినేషన్ చేశామని, మొత్తంగా ఇప్పటివరకు 1,92,12,96,720 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 21 May,2022 10:29AM