భద్రాద్రి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయిని ఎక్సైజ్ సిబ్బంది పట్టుకున్నారు. వివరాల్లోకెళ్తే.. ఆంధ్రప్రదేశ్ నుంచి ఝార్ఖండ్‌కు కారులో భద్రాచలం మీదుగా దుండగులు గంజాయిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో భద్రాచలం శివారు ప్రాంతంలో కారును ఆపేందుకు ఎక్సయిజ్ శాఖ సిబ్బంది ప్రయత్నించింది. అయితే ఇద్దరు దుండగులు కారు ఆపకుండా వేగంగా వెళ్లిపోయారు. అనంతరం రామాలయం ప్రాంతంలో గంజాయితో సహా కారును వదిలేసి పరారయ్యారు. కారుతో పాటు కారులో ఉన్న సుమారు 150 కేజీల గంజాయి ప్యాకెట్లను ఎక్సైజ్ సిబ్బంది స్వాధీనం చేసుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm