హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ శనివారం ఎమోషనల్ ట్వీట్ చేశారు. నేడు రాజీవ్ గాంధీ వర్ధంతి కాగా రాహుల్.. తాను తన తండ్రిని మిస్ అవుతున్నానంటూ ట్వీట్ చేశారు. 'మా నాన్న దూరదృష్టి గల నాయకుడు, అతని విధానాలు ఆధునిక భారతదేశాన్ని రూపొందించడంలో సహాయపడ్డాయి. ఆయన కరుణ, దయగల వ్యక్తి. అలాగే నాకు, ప్రియాంకకు అద్భుతమైన తండ్రి, క్షమాపణ, సానుభూతిల విలువను ఆయన మాకు నేర్పించారు. నేను ఆయనను చాలా మిస్ అవుతున్నాను. మేము కలిసి గడిపిన సమయాన్ని ప్రేమగా గుర్తుంచుకుంటాను` అని రాహుల్ ట్వీట్ లో పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm