హైదరాబాద్: వేరే కులం అమ్మాయిన పెండ్లి చేసుకున్నందుకు నీరజ్ అనే యువకుడిని అమ్మాయి సోదరులు శుక్రవారం దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే నీరజ్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురికి తరలించారు. మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం చేయనున్నారు. అయితే హత్యకు నిరసనగా మార్చురీ వద్ద కులనిర్మూలన సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ.. రాష్ర్టంలో ఇప్పటివరకు 71కి పైగా పరువు హత్యలు జరిగాయని తెలిపారు. కుల, మత దురహంకారంతో ఇలాంటి హత్యలు చేస్తున్నారని మండిపడ్డారు. సక్రమమార్గం చూపించేవారు లేక యువత ఇలాంటి దారుణాలు వెళుతోందని చెప్పారు. సమాజంతో పాటు తల్లిదండ్రులు, యువతలో మార్పు రావాల్సిన అవసరం ఉందని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm