న్యూఢిల్లీ : జ్ఞానవాపిపై ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టిన ఢిల్లీ ప్రొఫెసర్ రతన్‌లాల్‌ను ఢిల్లీ సైబర్ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో తాజాగా నిర్వహించిన సర్వేలో శివలింగం ఉన్నటు బయపడటం పట్ల ఢిల్లీ యూనివర్సిటీలోని హిందూ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ రతన్ లాల్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే, ప్రొఫెసర్ చేసిన ప్రకటన రెచ్చగొట్టేవిధంగా ఉందంటూ... ఢిల్లీ లాయర్ వినీత్ జిందాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం రాత్రి రతన్‌లాల్ పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. శుక్రవారం రాత్రి ఐపిసి 153 ఏ, 295 ఏ కింద ప్రొఫెసర్‌ను అరెస్టు చేసినట్లు ఢిల్లీ సైబర్ పోలీసులు తెలిపారు. ప్రొఫెసర్‌ను శనివారం కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది.