హైదరాబాద్ : వెస్టిండీస్ క్రికెటర్ షిమ్రాన్ హెట్మెయర్ పై భారత్ క్రికెట్ జట్టు మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో నెటిజన్లు ఆయన పై ఓ రేంజ్ లో ఫైరవుతున్నారు. శుక్రవారం చెన్నైసూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కు కామెంటరీ చేస్తున్న గవాస్కర్ 'హెట్మెయర్ భార్యకు డెలివరీ అయింది... మరి, రాయల్స్(రాజస్థాన్ రాయల్స్) కోసం హెట్మెయర్ డెలివర్ చేస్తాడా?` అంటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలా క్రికెటర్ భార్యల ప్రస్తావన తీసుకురావాల్సి అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఈ నెల 10న హెట్మెయర్ భార్య ప్రసవించింది. దాంతో హెట్మెయర్ రాజస్థాన్ బబుల్ ను వీడి గయానాకు వెళ్లాడు. కొన్ని రోజుల పాటు వారి తొలి బిడ్డ, భార్య దగ్గర ఉండి మళ్ల తిరిగి వచ్చాడు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 21 May,2022 01:02PM