హైదరాబాద్ : గుట్కా ప్రకటనల్లో కనిపించి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని నలుగురు బాలీవుడ్ స్టార్ హీరోలపై ఓ సామాజికవేత్త ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదైంది. వివరాల్లోకెళ్తే.. అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, రణ్‌వీర్ సింగ్ వంటి స్టార్ హీరోలు డబ్బు కోసం గుట్కా ప్రకటనల్లో కనిపించి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన సామాజికవేత్త తమన్నా హష్మీ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దాంతో పై నలుగురు హీరోలపై సెక్షన్ 467, 468, 439, 120 బి కింద కేసు నమోదైంది. మే 27న ఈ కేసును న్యాయస్థానం విచారించనుంది.
అయితే ఇటీవలే పాన్ మసాలా యాడ్‌లో నటించినందుకు బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవ్‌గణ్, అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్‌లపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దాంతో అక్షయ్ వెనక్కు తగ్గారు. ఆ ప్రకటన నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. అలాగే అక్టోబర్ 2021లో అమితాబ్ బచ్చన్ చూయింగ్ టుబాకో బ్రాండ్‌తో తన ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. బచ్చన్‌కు కొన్ని వివరాలు తెలియవని పేర్కొంటూ అతని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 21 May,2022 01:25PM