హైదరాబాద్ : హైదరాబాద్ లోని బేగంబజార్ లో శుక్రవారం నీరజ్ అనే యువకుడిని దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ప్రేమించి పెండ్లి చేసుకున్నాడని అతని భార్య బంధువులే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మృతుడు నీరజ్ భార్య సంజన తన రెండు నెలల కుమారుడు, బంధువులతో కలిసి రోడ్డుపై ధర్నాకు దిగింది. తన భర్తను చంపిన వారిని ఉరి తీయాలంటూ డిమాండ్ చేసింది. తన సోదరులే నీరజ్ ను చంపారని, ఏడాది కాలంగా చంపుతామంటూ బెదిరిస్తున్నారని ఆరోపించింది. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా వారు పెడచెవిన పెట్టారని, ఇప్పుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే నిందితులకు శిక్షపడేలా చూస్తామంటూ అధికారులు, ఎమ్మెల్యే రాజాసింగ్ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
మరోవైపు సంజన తల్లి, సోదరి ఈ హత్య ఘటనపై ఇప్పటికే స్పందించారు. తమ కుటుంబానికి ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 21 May,2022 02:17PM