హైదరాబాద్: బేగంబజార్‌లో పరువు హత్య నేపథ్యంలో బేగంబజార్ కూడలిలో మృతుడు నీరజ్ భార్య సంజన రెండు నెలల బాబుతో ధర్నాకు దిగారు. సంజన మాత్రం సోదరులే తన భర్తను హత్య చేశారని ఆరోపిస్తోంది. ఏడాదిగా తన సోదరులు నీరజ్‌ను బెదిరిస్తున్నట్టు చెబుతున్న సంజన పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు వెనక్కితగ్గలేదని ఆవేదన చెందుతున్నారు. తన భర్తను పొట్టనబెట్టుకున్న నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బేగంబజార్ కూడలిలో ఆమెకు ధర్నాకు దిగింది. అనుమానితులను గుర్తుపట్టేందుకు సంజనను పోలీసులు ఠాణాకు తీసుకెళ్లారు.
Mon Jan 19, 2015 06:51 pm