- ఎన్‌కౌంటర్‌కు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి.
హైదరాబాద్: దిశ లైంగికదాడి, హత్య ఘటనలో చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్ బూటకమని, కట్టుకథలా వుందని సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ సిర్పుర్కర్ నేతృత్వంలోని కమిషన్ నిర్ధారణలపై సుప్రీం కోర్టు సూచనలను అమలు చేయాలని, ఎన్‌కౌంటర్‌కు బాధ్యులైన 10 మంది పోలీసులపై తగు చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్రకమిటీ డిమాండ్ చేస్తున్నది. 2019లో హైదరాబాద్ శివారులో వెటర్నరీ డాక్టరుపై అత్యాచారం, హత్య, నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో సుప్రీంకోర్టు జస్టిస్ సిర్పుర్కర్ నేతృత్వంలోని కమిషన్‌ను నియమించింది. కమిషన్ విచారణ జరిపి 387 పేజీల నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ నివేదికలో ఆత్మరక్షణకే కాల్పులు జరిపామనే పోలీసుల వాదనకు ఆధారాల్లేవని చెప్పింది. వారు చెప్పిన వాదనలలో పొంతన లేదని పేర్కొంది. హత్యాచార నిందితులను చంపాలనే కోణంలోనే ఎన్‌కౌంటర్ జరిగిందని స్పష్టం చేసింది. నిందితుల గుర్తింపు, అరెస్టుల సందర్భంలో చట్టబద్ద హక్కుల ఉల్లంఘనలు జరిగాయని, కొన్ని కోణాల్లో న్యాయ నిబంధనలను తుంగలో తొక్కారని, విస్మరించారని నివేదికలో తేల్చిచెప్పింది.
ప్రజలు ఒత్తిడి చేస్తున్నారని అనుమానితులను ఎన్‌కౌంటర్ చేయడం, చట్టప్రకారం వ్యవహరించకపోవడం, చట్టాన్ని పోలీసులు తమ చేతుల్లోకి తీసుకోవడం సరైంది కాదు. అందువల్ల సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలను అమలుచేస్తూ, చట్టప్రకారమే పోలీసు వ్యవస్ధ వ్యవహరించాలని సీపీఐ(ఎం) కోరుతున్నది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 21 May,2022 05:27PM