- అక్కంపేటలో 'రచ్చబండ' ప్రారంభం
హన్మకొండ: కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నదాత చేయి చాచి అడిగే అవసరం లేకుండా.. తలెత్తుకుని బతికేలా చేస్తామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో నిర్వహించిన 'రచ్చబండ' కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్రెడ్డి.. రైతు చనిపోతే బీమా వర్తింపజేస్తున్న రాష్ట్రప్రభుత్వం మరి పంటలు నష్టపోతే పరిహారం ఎందుకివ్వదని ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ దళితులు, అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నిండలేదని ఆయన ఆక్షేపించారు. రైతులకు కాంగ్రెస్ తోనే భరోసా అని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఏడాదిలో గద్దెనెక్కే కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నదాత చేయి చాచి అడిగే అవసరం లేకుండా.. తలెత్తుకుని బతికేలా చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా అక్కంపేట గ్రామాన్ని దత్తత తీసుకుంటానని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అధికారంలోకి రాగానే అక్కంపేటను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీని అక్కంపేటకు తీసుకొస్తానన్న రేవంత్.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వరంగల్ డిక్లరేషన్ను అమలు చేస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు 'రచ్చబండ' కార్యక్రమానికి హాజరైన రేవంత్రెడ్డికి స్థానిక నేతలు, రైతులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి రేవంత్రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం ఓ రైతు పూరి గుడిసెలో పార్టీ నేతలతో కలిసి భోజనం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 21 May,2022 05:52PM