హైదరాబాద్: యాదగిరిగుట్ట ఆటో కార్మికుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలి కోరుతూ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. ఆ లేఖలో యాదగిరిగుట్టలో గత 30 సంవత్సరాలుగా ఆటోలలో నిరంతరం భక్తులు క్రింది నుండి ఆలయం పైకి వెళ్తున్నారు. దేవాలయం అభివృద్ధి చేసి పున:ప్రారంభించిన తర్వాత ఆలయ అధికారులు ఎటువంటి ఆదేశాలు లేకుండా ఏకపక్షంగా ఆటోలు పైకి వెళ్ళడానికి అనుమతి లేదని నిర్ణయం తీసుకున్నారు. దీంతో దీనిపై ఆధారపడ్డ 300 కుటుంబాలు వీధిన పడ్డాయి. గత నెల రోజులుగా వీరు కుటుంబాలతో సహా ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు. ఆర్టీసీ బస్సులు లేనప్పుడు, భక్తుల రద్దీ సమయాలలో గుట్టపైకి, వసతి గృహాలకు ప్రయాణీకులు ఆటోలలో వెళ్ళేవారు. వృద్ధులు, వికలాంగులు, చిన్నపిల్లలు, ఆలయ సిబ్బంది, పూజారుల రాకపోకలకు ఇంతకాలం సౌకర్యంగా ఉన్న ఆటోలను అకస్మాత్తుగా నిలిపివేయటంపై ప్రయాణీకులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పేద కుటుంబాల యువత ఫైనాన్స్, అప్పులు చేసి ఆటోలు కొనుక్కుని ఆలయం వద్ద నడుపుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఆటోలను అనుమతించకపోతే ఉన్న ఉపాధి కోల్పోతారు. కావున మీరు తక్షణమే జోక్యం చేసుకుని ఆలయం పైకి ఆటోలు వెళ్లడానికి అనుమతించేందుకు ఆలయ ఈఓకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నాను.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 21 May,2022 06:40PM