హైదరాబాద్: దేశంలో నిత్యావసర వస్తువులు, సహా పెట్రోల్, డీజిల్, నిర్మాణ రంగ వస్తువుల ధరలు భారీగా పెరిగిన వేళ కేంద్ర ప్రభుత్వం ఆ భారాన్ని తగ్గించే దిశగా నిర్ణయాలు తీసుకుంది. చమురు, గ్యాస్, నిర్మాణ రంగ వస్తువులపై సుంకాలు తగ్గించింది. లీటర్ పెట్రోల్‌పై 8 రూపాయలు, డీజిల్‌పై 6 రూపాయలు ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తాజాగా తగ్గింపుతో లీటర్ పెట్రోల్‌పై రూ.9.50, డీజిల్‌పై రూ.7.. తగ్గే అవకాశం ఉంది. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద సిలిండర్లు పొందుతున్న లబ్దిదారులకు కూడా కేంద్రం ఊరట కల్పించింది. ఈ పథకం కింద ఏడాదికి 12 సిలిండర్ల వరకు ఒక్కో దానిపై కేంద్రం రూ. 200 సబ్సిడీని ప్రకటించింది.
Mon Jan 19, 2015 06:51 pm