హైదరాబాద్ : బేగంబజార్ కులోన్మాద హత్య కేసులో ఆరుగురిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నీరజ్ అనే యువకుడిని దారుణంగా శుక్రవారం రాత్రి హత్య చేసిన విషయం తెలిసిందే. హత్య కేసులో అభినందన్, విజయ్, సంజయ్, రోహిత్, మహేశ్‌తో పాటు ఓ బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుకు సంబంధించిన విషయాలను వెస్ట్‌జోన్ డీసీపీ జోవియల్ డేవిస్ వివరించారు. నీరజ్ భార్య సంజన పెద్దనాన్న కుమారులే హత్య చేసినట్లు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm