హైదరాబాద్ : రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. సంగారెడ్డి డిసిఆర్బిలో పనిచేస్తున్న శ్రీనివాస్ నాయుడును శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపిగా, ట్రాఫిక్ ఏసీపీగా పనిచేస్తున్న విశ్వప్రసాద్ ను చీఫ్ ఆఫీస్ లో రిపోర్టు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సీసీఎస్ లో పనిచేస్తున్న నరసింగ రావును పంజాగుట్ట ఏసీపీగా, పంజాగుట్ట ఏసీపీగా పనిచేస్తున్న గణేష్ ను చీఫ్ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలని, ఏసిబిలో పనిచేస్తున్న రమణమూర్తిని ఇల్లందు డిఎస్పిగా, కామారెడ్డి డి సి ఆర్ విలో పనిచేస్తున్న నాగభూషణంను సూర్యాపేట డీఎస్పీగా, సూర్యాపేట డిఎస్పీ గా పనిచేస్తున్న మోహన్ కుమార్ ను చీఫ్ ఆఫీస్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm